Virat Kohli: కోహ్లీని హెచ్చరించిన బీసీసీఐ

  • యోయో టెస్ట్ స్కోరును సోషల్ మీడియాలో షేర్ చేసిన కోహ్లీ
  • జట్టు సమాచారాన్ని బహిర్గతం చేయవద్దన్న బీసీసీఐ
  • మరోసారి ఇలాంటివి పునరావృతం కాకూడదని హెచ్చరిక
BCCI warns Kohli

తన యోయో టెస్ట్ స్కోరును విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో షేర్ చేయడంపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీమ్ రహస్య సమాచారాన్ని పబ్లిక్ ప్లాట్ ఫామ్ లో బహిర్గతం చేయడం బీసీసీఐ రూల్స్ ను ఉల్లంఘించడం కిందకు వస్తుందని హెచ్చరించింది. మరోసారి ఇలాంటివి పునరావృతమైతే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. జట్టులో ఉన్న సభ్యులెవరూ టీమ్ సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని ఆదేశించింది. 

ఈ నెల 27 నుంచి ఆసియా కప్ ప్రారంభం కాబోతోంది. దీంతో జట్టు సభ్యుల కోసం బెంగళూరులో శిక్షణా శిబిరాన్ని బీసీసీఐ నిర్వహిస్తోంది. టీమ్ సభ్యులకు ఫిట్ నెస్ టెస్ట్ (యోయో) నిర్వహించింది. యోయో టెస్టులో తనకు 17.2 స్కోరు వచ్చినట్టు కోహ్లీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. బీసీసీఐ నిర్దేశించిన స్కోరు 16.5ని అధిగమించినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశాడు. దీంతో బీసీసీఐ అసహనం వ్యక్తం చేసింది. జట్టు అంతర్గత వివరాలను బహిరంగ పరచొద్దని ఆటగాళ్లను హెచ్చరించింది.

More Telugu News