rain: తెలంగాణలో మళ్లీ వర్షాలు.. పలు జిల్లాలకు నేడు ఎల్లో అలర్ట్

Yellow alert for few Telangana districts today
  • బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం
  • మూడు రోజులు వర్షాలు కురుస్తాయని అంచనా
  • 28 నుంచి సెప్టెంబర్ 2 వరకు మళ్లీ పొడి వాతావరణం
తెలంగాణలో వాతావరణం మారనుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. మరి కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని అంచనా వేసింది. ఈ నెల 28 నుంచి సెప్టెంబర్‌ 2 మధ్య వర్షాలకు విరామం ఉంటుందని అంచనా వేసింది. అనంతరం సెప్టెంబర్‌ 3 తర్వాత రాష్ట్రంలో మళ్లీ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది.
rain
Telangana
yellow
alert

More Telugu News