ఖమ్మం జిల్లాలో భూప్రకంపనలు.. పరుగులు తీసిన జనాలు

Earthquake in Khammam district Manuguru
  • తెల్లవారుజామున 4.43 గంటల సమయంలో ప్రకంపనలు
  • ప్రకంపనలతో ఊగిపోయిన ఇళ్లు
  • నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచిన ప్రజలు 
ఖమ్మం జిల్లాలోని మణుగూరు పట్టణాన్ని భూప్రకంపనలు మరోసారి వణికించాయి. తెల్లవారుజామున 4.43 గంటల సమయంలో ప్రకంపనలు వచ్చాయి. ఈ ప్రకంపనలతో ఇళ్లు ఊగిపోయాయి. దీంతో నిద్రలో ఉన్నవారు ఉలిక్కిపడి లేచారు. భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. అయితే భూప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. భూప్రకంపనలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు. గత శనివారం సాయంత్రం కూడా మణుగూరు మండలంలో భూప్రకంపనలు సంభవించాయి. రోజుల వ్యవధిలో రెండు సార్లు ప్రకంపనలు సంభవించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
Go Back to Shorts
Earthquake
Khammam District
Manuguru

More Telugu News