Vangaveeti Radha: నారా లోకేశ్ తో ఏకాంతంగా భేటీ అయిన వంగవీటి రాధా

Vangaveeti Radha meets Nara Lokesh
  • పాదయాత్ర విరామం సమయంలో లోకేశ్ ను కలిసిన రాధా
  • దాదాపు 20 నిమిషాల పాటు కొనసాగిన సమావేశం
  • త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న రాధా

టీడీపీ యువనేత నారా లోకేశ్ తో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ భేటీ అయ్యారు. నిన్నటి పాదయాత్ర విరామ సమయంలో వీరి సమావేశం జరిగింది. దాదాపు 20 నిమిషాల పాటు ఇరువురూ ఏకాంతంగా భేటీ అయ్యారు. వారు ఏయే అంశాలపై చర్చించారనే వివరాలు మాత్రం తెలియరాలేదు. మరోవైపు వంగవీటి రాధా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. నరసాపురం మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ జక్కం అమ్మాణి, బాబ్జీ దంపతుల కుమార్తె పుష్పవల్లిని రాధా పెళ్లి చేసుకోబోతున్నారు. సెప్టెంబర్ 6న వీరి పెళ్లి జరగనున్నట్టు ఆయన సన్నిహితులు తెలిపారు.

  • Loading...

More Telugu News