Kottu Satyanarayana: చంద్రబాబు దగ్గర కిరాయి తీసుకుని మాట్లాడడం పవన్ కు అలవాటు: మంత్రి కొట్టు సత్యనారాయణ

Minister Kottu Satyanarayana slams Pawan Kalyan and Jansena party
  • శ్రీశైలంలో మీడియాతో మాట్లాడిన మంత్రి కొట్టు సత్యనారాయణ
  • జగన్ ను ఎదుర్కోలేక దొంగ ఓట్లు అంటున్నారని ఆగ్రహం
  • జనసేన పార్టీకి ఓ వైఖరి అంటూ లేదని విమర్శలు
  • చంద్రబాబుకు అద్దెకిచ్చే పార్టీలా మారిపోయిందని వ్యాఖ్యలు
ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ విపక్ష నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం జగన్ ను ఎదుర్కోలేక, దొంగ ఓట్లు అంటూ మాట్లాడుతున్నారని విమర్శించారు. 

పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి ఓ వైఖరి అంటూ లేదని, చంద్రబాబుకు అద్దెకు ఇచ్చే పార్టీలా మారిపోయిందని వ్యంగ్యం ప్రదర్శించారు. అలాంటి పార్టీకి ఎవరు విలువ ఇస్తారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వద్ద కిరాయి తీసుకుని మాట్లాడడం పవన్ కు అలవాటుగా మారిందని అన్నారు. విశాఖ రుషికొండలోని నిర్మిస్తున్నది ప్రభుత్వ భవనాలు అని మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. 

ఇవాళ శ్రీశైలంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో తాము అభివృద్ధి పనులు చేపట్టామని, వచ్చే నెలలో సీఎం జగన్ ప్రారంభోత్సవాలు చేస్తారని వెల్లడించారు.
Kottu Satyanarayana
Pawan Kalyan
Janasena
Chandrababu
YSRCP
Jagan
Andhra Pradesh Assembly

More Telugu News