Allu Arjun: చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్... సుకుమార్ ఆనందానికి ఈ వీడియోనే నిదర్శనం

Allu Arjun and Sukumar celebrates the occasion after national best actor award announcement
  • బన్నీకి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు
  • ఈ పురస్కారానికి ఎంపికైన తొలి తెలుగు హీరోగా బన్నీ రికార్డు
  • అల్లు వారింట పండుగ వాతావరణం
  • భావోద్వేగాలకు లోనైన సుకుమార్
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డు నెలకొల్పారు. పుష్ప చిత్రంలో నటనకు గాను అల్లు అర్జున్ ను విశిష్ట పురస్కారం వరించిన సంగతి తెలిసిందే. 

జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ప్రకటన వెలువడగానే బన్నీ ఇంటి వద్ద పండుగ వాతావరణం నెలకొంది. దర్శకుడు సుకుమార్, నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి తదితరులు అల్లు వారి ఇంటికి విచ్చేసి తమ హీరోకు శుభాకాంక్షలు తెలియజేశారు. 

సుకుమార్ అయితే తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. అల్లు అర్జున్ ను గట్టిగా హత్తుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇరువురి ఆత్మీయత అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది. అందరూ కరతాళ ధ్వనులతో అల్లు అర్జున్, సుకుమార్ ద్వయాన్ని అభినందించారు. బన్నీ తండ్రి అల్లు అరవింద్, అర్ధాంగి స్నేహ కూడా ఈ సంబరాల్లో పాలుపంచుకున్నారు. 

దీనికి సంబంధించిన వీడియోను చిత్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ లో పంచుకుంది.
Allu Arjun
National Best Actor
Sukumar
Pushpa
Tollywood

More Telugu News