Prathipati Pulla Rao: ఓడిపోయినప్పటికీ లోకేశ్ మంగళగిరిలోనే పోటీ చేస్తున్నారు: ప్రత్తిపాటి

Prathipati says Lokesh will contest from Mangalagiri again
  • లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతమైందన్న ప్రత్తిపాటి 
  • జగన్ తన పాదయాత్రలో జనాలను కనీసం దగ్గరకు రానివ్వలేదని ఆరోపణ
  • ప్రభుత్వ వ్యవస్థలను అడ్డుపెట్టుకొని మార్గదర్శిపై దాడులు చేస్తున్నారని వ్యాఖ్య
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతమైందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఓడిపోయినప్పటికీ లోకేశ్ ఎంతో ధైర్యంగా మంగళగిరిలోనే పోటీ చేస్తున్నారన్నారు. కానీ జగన్ తన పాదయాత్రలో జనాలను కనీసం దగ్గరకు రానివ్వలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలను అడ్డుపెట్టుకొని మార్గదర్శిపై దాడులు చేస్తున్నారన్నారు. మార్గదర్శిపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీయలేరన్నారు.
Prathipati Pulla Rao
Telugudesam
YSRCP
Nara Lokesh

More Telugu News