neha shetty: టిల్లు గాని కోసం రాధిక మళ్లీ వస్తోంది!

Neha shetty to appear in a guest role in DJ Tillu sequel
  • డీజే టిల్లులో ఆకట్టుకున్న సిద్ధు, నేహాశెట్టి కెమిస్ట్రీ
  • ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న టిల్లు స్క్వేర్
  • హీరోయిన్‌గా నటిస్తున్న అనుపమ
టాలీవుడ్‌లో చిన్న సినిమాల హీరోగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్న సిద్ధు జొన్నలగడ్డకు ‘డీజే టిల్లు’ చిత్రం భారీ బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో సిద్ధు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఎక్కడికి వెళ్లినా అతడిని డీజే టిల్లు అని పలుకరిస్తున్నారు. సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్‌ రాధిక పాత్ర పోషించిన నేహాశెట్టికి సైతం అంతే క్రేజ్ లభించింది. ఈ సినిమా తర్వాత ఇద్దరూ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం డీజే టిల్లుకు సీక్వెల్‌గా ‘టిల్లు స్వ్వైర్‌‌’ తెరకెక్కుతోంది. ఇందులో సిద్ధునే హీరోగా ఉన్నప్పటికీ హీరోయన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. రాధిక పాత్ర తొలి పార్ట్‌తోనే పూర్తయిందని చిత్ర బృందం ఇదివరకే ప్రకటించింది. 

అయితే, ఆ పాత్రకు లభించిన ఆదరణ దృష్ట్యా సీక్వెల్‌లో నేహా శెట్టి కోసం అతిథి పాత్రను రూపొందించినట్టు తెలుస్తోంది. సినిమాలో కొన్ని నిమిషాల పాటు రాధిక క్యారెక్టర్‌‌ ఉంటుందని, ప్రస్తుతానికి ఆ విషయాన్ని రహస్యంగా ఉంచినట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే డీజే టిల్లు–రాధిక కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. కాగా, నేహా శెట్టి నటించిన ‘బెదురులంక 2012’ చిత్రంతో ఈ శుక్రవారం విడుదల కానుంది. రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాల్లోనూ ఆమె హీరోయిన్ గా నటిస్తోంది.
neha shetty
siddu jonnalagadda
dj tillu
anupama

More Telugu News