Konakalla Narayana: తప్పుడు నోటీసులతో పోలీసులు పరువు పోగొట్టుకున్నారు: కొనకళ్ల నారాయణ

Why police notice not given to Kodali Nani and Vallabhaneni Vamsi asks Konakalla Narayana
  • కొడాలి నాని, వంశీలకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదన్న కొనకళ్ల
  • పరువు లేని వ్యక్తుల పరువును ఎలా తీస్తామని ప్రశ్న
  • ప్రజలకు ముఖాలు చాటేస్తూ వారి పరువు వారే తీసుకుంటున్నారని ఎద్దేవా
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దంటూ టీడీపీ యువనేత నారా లోకేశ్ కు పోలీసులు నోటీసులు ఇవ్వడంపై టీడీపీ నేత, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ విమర్శలు గుప్పించారు. పరువే లేని వ్యక్తుల పరువును తాము ఎలా తీస్తామని ఆయన ప్రశ్నించారు. ప్రజలను మోసగించి జగన్ అధికారంలోకి వచ్చారని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, ప్రజలకు ముఖాలను చాటేస్తూ వైసీపీ నేతలు వారి పరువును వారే తీసుకున్నారని ఎద్దేవా చేశారు. సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడే కొడాలి నాని, వల్లభనేని వంశీలకు పోలీసులు నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. లోకేశ్ కు తప్పుడు నోటీసులు ఇచ్చి పోలీసులు పరువు పోగొట్టుకున్నారని అన్నారు. 

మరోవైపు యువగళం పాదయాత్ర వాలంటీర్ల కన్వీనర్ రవి నాయుడు మాట్లాడుతూ... లోకేశ్ భద్రతకు కూడా రానంత మంది పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చారని విమర్శించారు. లోకేశ్ పాదయాత్రకు ఆటంకాలు కలిగించే ప్రతి చర్యను అడ్డుకుంటామని చెప్పారు.
Konakalla Narayana
Nara Lokesh
Telugudesam
Kodali Nani
Vallabhaneni Vamsi
YSRCP

More Telugu News