Mahesh Babu: మహేశ్​–రాజమౌళి సినిమా గురించి మరో లీక్​ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్

SSMB29 will be an African adventure film admits Vijayendra prasad
  • ఇది ఆఫ్రికన్ అడ్వెంచర్‌‌ సినిమా అన్న రచయిత
  • సినిమాలో హాలీవుడ్‌ నటులకూ ఆస్కారం ఉందని వెల్లడి
  • వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనున్న చిత్రం
ఆర్ఆర్ఆర్ అఖండ విజయం తర్వాత దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా ప్రకటించారు. దీన్ని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించనున్నారు. అందుకు తగ్గట్టుగా రాజమౌళి తండ్రి, స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు గురించి తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇది ఆఫ్రికన్ అడ్వెంచర్ ఫిల్మ్ అని చెప్పారు. అలాగే ఈ సినిమాలో హాలీవుడ్ నటులను తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్పారు.

కాగా, ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో మొదలయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం. 2025లో ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మహేశ్ బాబు.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ‘గుంటూరు కారం’ సినిమాతో బిజీగా ఉన్నాడు. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే మహేశ్.. రాజమౌళి సినిమాపైనే పూర్తి ఫోకస్ పెట్టనున్నారు.
Mahesh Babu
Rajamouli
Vijayendra prasad
Hollywood

More Telugu News