Ram: భారీ అంచనాల మధ్య రూపొందిన 'స్కంద' .. ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఖరారు!

Skanda Pre Release Date Confirmed
  • రామ్ హీరోగా రూపొందిన 'స్కంద'
  • 'అఖండ' తరువాత బోయపాటి చేసిన సినిమా ఇది 
  • ఈ నెల 26వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • సెప్టెంబర్ 15వ తేదీన సినిమా విడుదల  
రామ్ హీరోగా బోయపాటి 'స్కంద' సినిమా చేశాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఆయన ఈ సినిమాను రూపొందించాడు. 'అఖండ' వంటి సంచలన విజయం తరువాత బోయపాటి ఈ సినిమా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది కూడా దైవశక్తిని టచ్ చేస్తూ సాగే కాన్సెప్ట్ కావడం మరింత ఆసక్తిని పెంచుతోంది. 

సెప్టెంబర్ 15వ తేదీన ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నట్టుగా, చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఇక ఇప్పుడు విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖాయం చేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. 

ఈ నెల 26వ తేదీన (శనివారం) ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహిస్తున్నారు. రామ్ సరసన నాయికగా శ్రీలీల కనువిందు చేయనుంది. తమన్ స్వరపరిచిన బాణీలు ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉండనున్నట్టుగా చెబుతున్నారు.
Ram
Sreeleela
Boyapati Sreenu
Skanda Movie

More Telugu News