2023 ODI World Cup: బుక్‌మైషోలో వరల్డ్​ కప్​ టికెట్లు.. మాస్టర్​కార్డు ఉన్న వాళ్లకు పండగే!

BCCI announces BookMyShow as official ticketing platform for 2023 ODI World Cup
  • రేపటి నుంచి టికెట్ల విక్రయాలు ప్రారంభం
  • మాస్టర్ కార్డ్ హోల్డర్లకు ఒక రోజు ముందే అందుబాటులోకి
  • సెప్టెంబర్ 29 నుంచి ప్రపంచ కప్ సన్నాహక మ్యాచ్‌లు
భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న వన్డే ప్రపంచ కప్ టికెట్లను విక్రయించేందుకు బుక్‌మైషో  (BookMyShow) సంస్థతో బీసీసీఐ ఒప్పందం కుదుర్చుకుంది. బుక్‌మైషో తమ టికెటింగ్ భాగస్వామిగా ఉంటుందని తెలిపింది. సెప్టెంబర్ 29న సన్నాహక మ్యాచ్‌లతో ప్రపంచ కప్ టోర్నమెంట్‌ ప్రారంభమవుతుంది. అక్టోబర్ 5 నుంచి ప్రధాన మ్యాచ్‌లు జరుగుతాయి. మెగా టోర్నీలో 10 వార్మప్ మ్యాచ్‌లతో కలిపి మొత్తం 58 మ్యాచ్‌లు ఉంటాయి. దేశవ్యాప్తంగా 12 ప్రధాన వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతాయి.

అభిమానులకు ఇబ్బందులు కలగకుండా ఐసీసీ, బీసీసీఐ ఆయా వేదికల్లో జరిగే మ్యాచ్ ల వారీగా టికెట్ల విక్రయాలను చేపట్టాయి. ప్రపంచ కప్ టికెట్లు బుక్‌మైషోలో అందుబాటులో ఉంటాయి. రేపటి నుంచి (ఆగస్టు 25) టికెట్ల విక్రయాలు మొదలవుతాయి. మాస్టర్ కార్డ్ (డెబిట్, క్రెడిట్) ఉన్నవాళ్ల కోసం బుక్‌మైషో ప్రీ సేల్ ఆఫర్ ను ఇచ్చింది. ఒక రోజు ముందే టికెట్లను కొనుగోలు చేసే సౌలభ్యం కల్పించింది. ఈ సాయంత్రం 6 నుంచి టికెట్లు అందుబాటులోకి వస్తాయి.
2023 ODI World Cup
India
BCCI
icc
BookMyShow
tickets

More Telugu News