Chandrayaan-3: చంద్రయాన్-3 విజయవంతం కావాలని ప్రార్థించిన అందరికీ థ్యాంక్స్: ఇస్రో చైర్మన్ సోమనాథ్

ISRO chairman thanks to all india people
  • దేశం కోసం స్ఫూర్తిదాయక కార్యం సాధించినందుకు గర్వంగా ఉందని వ్యాఖ్య
  • శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారన్న చైర్మన్
  • ఇస్రోకు మద్దతుగా నిలిచిన ప్రధానికి ధన్యవాదాలు  తెలిపిన సోమనాథ్ 
చంద్రయాన్-3 విజయవంతం కావాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు. దేశం కోసం స్ఫూర్తిదాయక కార్యం సాధించినందుకు ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారని, ఇస్రోకు మద్దతుగా నిలిచిన ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. మనం చంద్రయాన్-3ని విజయవంతంగా చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ చేశామని, ఇప్పుడు జాబిలిపై భారత్ నిలిచిందన్నారు.


Chandrayaan-3
ISRO
Chandrababu

More Telugu News