Sita Dayakar Reddy: కాంగ్రెస్‌లో చేరనున్న మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి?

Sita Dayakar Reddy to join Congress
  • ఇటీవలే కన్నుమూసిన కొత్తకోట దయాకర్ రెడ్డి
  • కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్న సీతా దయాకర్ రెడ్డి
  • ఇప్పటికే ఎమ్మెల్యేగా పని చేసిన సీతా దయాకర్ రెడ్డి
దివంగత ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి భార్య, మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆమె కాంగ్రెస్ కీలక నేతలతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. కొత్తకోట దయాకర్ రెడ్డి ఇటీవలే మృతి చెందిన విషయం విదితమే. మరోవైపు, బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల అభ్యర్థులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టికెట్ రాని వ్యక్తులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో అసంతృప్తులకు గాలెం వేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పావులు కదుపుతున్నాయి.
Sita Dayakar Reddy
Congress

More Telugu News