Supreme Court: జడ్జి జయకుమార్ ను సస్పెండ్ చేసిన సుప్రీంకోర్టు

Supreme Court suspends Judge Jayakumar
  • మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికపై తీర్పును వెలువరించిన జయకుమార్
  • శ్రీనివాస్ గౌడ్ సహా 10 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశం
  • కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలపై కేసులు పెట్టాలంటూ ఆదేశాలు జారీ

తెలంగాణ ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి జయకుమార్ ను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికపై జడ్జి జయకుమార్ కీలక తీర్పును వెలువరించారు. శ్రీనివాస్ గౌడ్ సహా 10 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల అధికారులపై కేసు పెట్టాలని కూడా ఆయన ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆయనపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్యంగబద్ధ వ్యవస్థలపై కేసులు పెట్టాలని ఎలా ఆదేశిస్తారని ప్రశ్నించింది. ఆయనపై సస్పెన్షన్ ను విధించింది.

  • Loading...

More Telugu News