Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్ భిక్షతోనే కేసీఆర్ సీఎం అయ్యారు: పొంగులేటి

Ponguleti fires on KCR
  • బీఆర్ఎస్ ను భూస్థాపితం చేయాలన్న పొంగులేటి
  • కేసీఆర్ కల్లబొల్లి మాటలను ప్రజలకు వివరించాలని పిలుపు
  • పదవి లేకపోయినా ప్రజలకు అండగా ఉన్నానన్న కాంగ్రెస్ నేత

ముఖ్యమంత్రి కపట నాటకాలను ప్రజలు గమనించాలని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అరాచకాలను, కేసీఆర్ కల్లబొల్లి మాటలను ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. బీఆర్ఎస్ ను భూస్థాపితం చేసి, కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు శ్రమించాలని పిలుపునిచ్చారు. జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీకి రుణపడి ఉన్నామని పొంగులేటి చెప్పారు. సోనియా భిక్షతోనే కేసీఆర్ సీఎం అయ్యారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు వస్తుండటంతో కేసీఆర్ సరికొత్త డ్రామాలను తెరతీస్తారని అన్నారు. తొమ్మిదేళ్ల పాటు ఆర్టీసీని పట్టించుకోని కేసీఆర్.. ఇప్పుడు ఎన్నికలు రావడంతో వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్టు ప్రకటించారని విమర్శించారు. తనకు పదవి లేకపోయినా నాలుగున్నరేళ్లుగా ప్రజలకు అండగా ఉంటున్నానని చెప్పారు.

  • Loading...

More Telugu News