Chandrayaan-3: మరో రెండు మూడు గంటల్లో నిర్దేశిత ప్రాంతానికి విక్రమ్, ఇస్రో ట్వీట్

All set to initiate the Automatic Landing Sequence
  • నేటి సాయంత్రం గం.5.44 సమయానికి నిర్దేశిత ప్రాంతానికి ల్యాండర్ విక్రమ్
  • అదే సమయానికి ఆటోమేటిక్ ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభం 
  • ఇస్రో అధికారిక వెబ్ సైట్, యూట్యూబ్, ఫేస్‌బుక్ పేజీలలో ప్రత్యక్ష ప్రసారం

ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్‌ను ప్రారంభించేందుకు అంతా సిద్ధంగా ఉందని, ల్యాండర్ విక్రమ్ నిర్దేశిత ప్రాంతానికి సాయంత్రం గం.5.44కు చేరుకుంటుందని ఇస్రో ట్వీట్ చేసింది. అదే సమయానికి ఆటోమేటిక్ ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపింది. సాయంత్రం గం.5.20 సమయానికి ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని తెలిపింది. అంతా అనుకున్నట్లుగా సాగితే చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ సాయంత్రం గం.6.04 సమయానికి చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపుతుంది. కాగా, ఈ ప్రయోగ ప్రక్రియలో చివరి పదిహేడు నిమిషాలు చాలా కీలకం. చంద్రయాన్-3 ప్రత్యక్ష ప్రసారాన్ని ఇస్రో అధికారిక వెబ్ సైట్‌లో చూడవచ్చు. అలాగే ఇస్రో యూట్యూబ్, ఫేస్‌బుక్ పేజీలలోనూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News