Posani Krishna Murali: నారా లోకేశ్ పై డీజీపీకి ఫిర్యాదు చేసిన పోసాని కృష్ణమురళి

Posani Krishna Murali complaint on Nara Lokesh to DGP
  • తనకు లోకేశ్ నుంచి ప్రాణహాని ఉందంటూ పోసాని ఫిర్యాదు
  • రక్షణ కల్పిస్తామంటూ హామీ ఇచ్చిన డీజీపీ
  • టీడీపీలో చేరమని అడిగితే తాను చేరలేదన్న పోసాని
టీడీపీ యువనేత నారా లోకేశ్ వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి ఫిర్యాదు చేశారు. తనను చంపడానికి లోకేశ్ కుట్ర పన్నినట్టు తనకు సమాచారం ఉందని, తనకు రక్షణ కల్పించాలని డీజీపీని కోరారు. డీజీపీతో భేటీ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ... తనకు భద్రత కల్పిస్తానని డీజీపీ హామీ ఇచ్చారని తెలిపారు. 

టీడీపీలో చేరాలని తనను అడిగితే తాను చేరలేదని... దీంతో లోకేశ్ ఈగో హర్ట్ అయిందని పోసాని చెప్పారు. తన హత్యకు కుట్ర జరుగుతోందనే విషయాన్ని తనకు కొందరు చెప్పారని... దీంతో తాను అలర్ట్ అయ్యానని చెప్పారు. లోకేశ్ బండారాన్ని బయటపెట్టింది తానేనని, అందుకే తనను టార్గెట్ చేశారని అన్నారు. అందరినీ బట్టలూడదీసి కొడతానని లోకేశ్ అంటుంటాడని, బట్టలు ఊడదీయడం ఎందుకని, బట్టలమీదే కొట్టొచ్చు కదా అని ప్రశ్నించారు. బట్టలు ఊడదీయడం లోకేశ్ కు అలవాటేమోనని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి పదవిపై తనకు మోజు లేదని చంద్రబాబు చెప్పారని... అదే నిజమైతే పవన్ కల్యాణ్ ను సీఎం చేస్తానని చెప్పొచ్చు కదా అని ప్రశ్నించారు. తనకు జగన్ అంటే ప్రేమ, పిచ్చి అని చెప్పారు.
Posani Krishna Murali
Tollywood
YSRCP
Jagan
Nara Lokesh
Chandrababu
Telugudesam
Pawan Kalyan
Janasena

More Telugu News