KCR: చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్, విజయసాయి... థ్యాంక్స్ చెప్పిన మెగాస్టార్

KCR and VijayasaiReddy birthday wishes to chiranjeevi
  • చిరంజీవికి శుభాకాంక్షలు చెప్పిన రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు
  • తెలుగు చిత్ర పరిశ్రమను కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని సాయిరెడ్డి ట్వీట్
  • విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ రోజు చిరంజీవి పుట్టిన రోజు నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, అలాగే వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు విషెస్ చెప్పారు. వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా చిరుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో జీవించాలని శ్రీవెంకటేశ్వరస్వామివారిని ప్రార్థిస్తున్నానని, మీరు తెలుగు చిత్ర పరిశ్రమను ప్రపంచవ్యాప్తంగానూ  కొత్త శిఖరాలకు తీసుకు వెళ్లాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.

తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినవారందరికీ చిరంజీవి థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు. నాకు విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు... మీ అందరి ప్రేమకు వినయపూర్వక నమస్కారం అంటూ ట్వీట్ చేశారు.
KCR
Chiranjeevi
Vijayasai Reddy
Telangana
Tollywood
Andhra Pradesh

More Telugu News