Narendra Modi: జోహాన్నెస్ బర్గ్ చేరుకున్న ప్రధాని మోదీ

PM Modi arrives Johannesburg to attend BRICS conference
  • దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సు
  • ఆగస్టు 22 నుంచి 24 వరకు సదస్సు
  • రష్యా తప్ప మిగతా బ్రిక్స్ దేశాల అధినేతలు హాజరు
బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా పయనమైన ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి కిందట జోహాన్నెస్ బర్గ్ చేరుకున్నారు. ఇక్కడి వాటర్ క్లూఫ్ ఎయిర్ ఫోర్స్ బేస్ స్టేషన్ లో ఆయనకు సంప్రదాయబద్ధమైన రీతిలో స్వాగతం లభించింది. ఎయిర్ పోర్టు వద్దకు ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో చేరుకుని ప్లకార్డులు, నినాదాలతో సందడి చేశారు. మోదీ ఆరికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

15వ బ్రిక్స్ దేశాల సదస్సుకు జోహాన్నెస్ బర్గ్ నగరం ఆతిథ్యమిస్తోంది. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ, చైనా దేశాధినేత షి జిన్ పింగ్ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. ఇరువురు కరచాలనం, పలకరింపుతో సరిపెట్టుకుంటారా, లేక ద్వైపాక్షిక అంశాలు, సరిహద్దు సమస్యలపై చర్చిస్తారా? అనే విషయమై అనిశ్చితి నెలకొంది. 

దీనిపై భారత ప్రధానమంత్రి కార్యాలయం ఎలాంటి ప్రకటన చేయలేదు. మోదీ, జిన్ పింగ్ మధ్య భేటీ ఉంటుందన్న ప్రచారం మాత్రం సాగుతోంది. 

కాగా, రష్యా తప్ప మిగతా బ్రిక్స్ దేశాల అధినేతలందరూ ఈ సదస్సుకు హాజరవుతున్నారు. బ్రిక్స్ దేశాల సదస్సు ఆగస్టు 22 నుంచి 24 వరకు జరగనుంది. ఆగస్టు 25న ప్రధాని మోదీ గ్రీస్ పర్యటనకు వెళ్లనున్నారు.
Narendra Modi
BRICS
Johannesburg
South Africa

More Telugu News