Kodali Nani: గుడివాడలో ట్రాఫిక్ జామ్: నారా లోకేశ్‌పై కొడాలి నాని విమర్శలు

Kodali Nani satires on Nara Lokesh
  • లోకేశ్ గన్నవరంలో పాదయాత్ర చేస్తే గుడివాడలో ట్రాఫిక్ జామ్ అయిందని సెటైర్
  • జగన్ నిలబెట్టిన అభ్యర్థి చేతిలో ఓడిపోయిన బచ్చా లోకేశ్ అని మండిపాటు
  • జగన్ ప్రజలను, దేవుడిని నమ్ముకున్నాడని వ్యాఖ్య
  • టీడీపీ మాత్రం పవన్ కల్యాణ్, మోదీని నమ్ముకున్నదని విమర్శ
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శలు గుప్పించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... లోకేశ్ గన్నవరంలో పాదయాత్ర చేస్తే గుడివాడలో ట్రాఫిక్ జామ్ అయిందని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో తమ పార్టీ అధినేత జగన్ పెట్టిన అభ్యర్థి చేతిలో ఓడిపోయిన బచ్చా లోకేశ్ అన్నారు. మంగళగిరిలో లోకేశ్ ఓడిపోయాడని గుర్తు చేశారు.

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని చెబుతున్నారని, కానీ 175 స్థానాలకు గాను గతంలోలా 22చోట్ల గెలుస్తారేమో అని చురకలు అంటించారు. తమ పార్టీ అధినేత జగన్ ప్రజలను, దేవుడిని నమ్ముకున్నాడన్నారు. కానీ వారిలా పవన్ కల్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీపై ఆధారపడలేదన్నారు. అసలు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీనా? అని ప్రశ్నించారు. పక్కన తెలంగాణలో పోటీ చేస్తుందా? అని నిలదీశారు. వెధవలు ఉన్న పార్టీ అని దుయ్యబట్టారు.
Kodali Nani
Nara Lokesh
Telugudesam
YSRCP

More Telugu News