Chandrababu: హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు హాజరుకానున్న చంద్రబాబు

Chandrababu will attend IIIT Hyderabada Silver Jubilee event
  • సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకుంటున్న హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ
  • ఆగస్టు 23న క్యాంపస్ లో విద్యార్థులతో ముఖాముఖి
  • హాజరుకానున్న టీడీపీ అధినేత చంద్రబాబు 
  • చంద్రబాబు హయాంలో ఏర్పాటైన హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ
హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటోంది. ఈ ఉత్సవాల్లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కూడా పాల్గొంటున్నారు. ఆయన రేపు (ఆగస్టు 23) ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో విద్యార్థులతో ముఖాముఖి సమావేశం కానున్నారు. ట్రిపుల్ ఐటీ ఆవిర్భావం, ఐటీ రంగ అభివృద్ధి వంటి అంశాలపై విద్యార్థులతో చర్చించనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. 

హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా యాజమాన్యం కొన్ని రోజులుగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగానే విద్యార్థులతో చంద్రబాబు ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలోనే, 1998లో హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ఏర్పాటైంది.
Chandrababu
IIIT Hyderabad
Silver Jubilee
Interaction
Students
TDP
Hyderabad
Andhra Pradesh
Telangana

More Telugu News