Chiranjeevi: మెగాస్టార్‌‌ చిరంజీవికి టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు!

TDP Chief Chandrababu Wishes Megastar Chiranjeevi
  • ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిరంజీవి 
  • చిరంజీవి స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగారంటూ చంద్రబాబు ప్రశంసలు
  • అభిమానుల హృదయాల్లో తన స్థానాన్ని పదిలపరుచుకున్నారని ట్వీట్
  • నిండు నూరేళ్లూ ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించిన మాజీ సీఎం
కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఆయనకు దేశవ్యాప్తంగా ఉన్న సినీ రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. చిరంజీవిని విష్ చేశారు. నిండు నూరేళ్లూ ఆరోగ్యంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. 

‘‘స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి.. సినీ అభిమానుల హృదయాల్లో చిరంజీవిగా చిరస్థానాన్ని పదిలపరుచుకున్న మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సినీ పరిశ్రమ భవిష్యత్తును, సినీ కార్మికుల సంక్షేమాన్ని సదా కోరుకునే మీరు.. నిండు నూరేళ్లూ ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను” అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
Chiranjeevi
Chandrababu
Megastar
TDP

More Telugu News