Prakash Raj: కాస్త ఎదగండయ్యా.. ట్రోల్స్‌పై ఘాటుగా స్పందించిన నటుడు ప్రకాశ్‌రాజ్

Joke Of Armstrong Times Prakash Raj Defends Chandrayaan3 Post
  • విద్వేషం.. విద్వేషాన్ని మాత్రమే చూస్తుందంటూ మరో ట్వీట్
  • జోక్‌ను జోక్‌గా చూడలేనివారు అది తమపైనే అనుకుంటారన్న ప్రకాశ్‌రాజ్
  • తాను కేరళ చాయ్‌వాలా గురించి చెప్పానని వివరణ
  • ట్రోల్ చేసిన చాయ్‌వాలా ఎవరంటూ పరోక్షంగా మోదీపై విసుర్లు
చంద్రయాన్ 3పై ట్వీట్ చేసి ట్రోలింగ్‌కు గురైన నటుడు ప్రకాశ్‌రాజ్ తగ్గేలా కనిపించడం లేదు. తనపై వస్తున్న ట్రోల్స్‌కు మరో ట్వీట్‌తో సమాధానం చెప్పారు. ‘విద్వేషం.. విద్వేషాన్ని మాత్రమే చూస్తుంది’ అని పేర్కొంటూ తన గత ట్వీట్‌కు వివరణ ఇచ్చారు. తానో పాత జోకును గుర్తు చేశానని వివరణ ఇచ్చారు. 

తన గత ట్వీట్ నీల్ఆర్మ్‌స్ట్రాంగ్ కాలం నాటి పాత జోక్‌‌కు సంబంధించిందని పేర్కొన్నారు. తాను కేరళ చాయ్‌వాలాపై పోస్టు షేర్ చేశానని, మరి ట్రోల్స్ చేసిన చాయ్‌వాలా ఎవరు? అని పరోక్షంగా మోదీని ఉద్దేశించి సెటైర్ వేశారు. జోక్‌ను అర్థం చేసుకోలేనివారు అది తమపైనే అని అనుకుంటారని ఘాటుగా బదులిచ్చారు. కాస్త ఎదగండయ్యా.. అంటూ వ్యంగ్యంగా పేర్కొన్నారు.

చంద్రుడిపై ల్యాండ్ అయ్యాక చంద్రయాన్ 3 పంపే తొలి ఫొటో ఇదేనంటూ ఓ చాయ్‌వాలా ఫొటోను ప్రకాశ్‌రాజ్ ఆదివారం షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయనను ట్రోల్ చేస్తూ ‘ఎక్స్’ను హోరెత్తించారు. చంద్రయాన్ 3 దేశం మొత్తానికి గర్వకారణమని, రాజకీయాన్ని, దేశాన్ని వేర్వేరుగా చూడాలని హితవు పలికారు. ఒకరిని ద్వేషించడం, దేశాన్ని ద్వేషించడం మధ్య ఉన్న అంతరాన్ని తెలుసుకోవాలని సూచించారు.
Prakash Raj
Twitter
Trolling
Chaiwala
Chandrayaan-3

More Telugu News