KCR: హరీశ్‌రావుపై మైనంపల్లి వ్యాఖ్యల పట్ల తీవ్రంగా స్పందించిన సీఎం కేసీఆర్

CM KCR responds on Mynampalli Hanmantharao comments on harish rao
  • మైనంపల్లి పార్టీ ఆదేశాలు పాటిస్తే మంచిదన్న బీఆర్ఎస్ అధినేత
  • ఆదేశాలు పాటించకపోతే ఆయనిష్టమని వ్యాఖ్య
  • పోటీ చేస్తారా? లేదా? ఆయనకే వదిలేశామని స్పష్టీకరణ
మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. మైనంపల్లి పార్టీ ఆదేశాలు పాటిస్తే మంచిదన్నారు. పాటించకపోతే ఇక ఆయనిష్టమన్నారు. పార్టీ తరఫున పోటీ చేస్తారా? లేదా? అనేది ఆయనకే వదిలేశామని చెప్పారు. మైనంపల్లి తాజాగా సిద్దిపేట ఎమ్మెల్యే, మంత్రి హరీశ్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన సందర్భంగా మీడియా ప్రతినిధులు మైనంపల్లి గురించి అడగగా.. కేసీఆర్ కూడా చురకలు అంటించారు.
KCR
Mynampally Hanumanth Rao
Harish Rao
BRS

More Telugu News