Etela Rajender: బీజేపీ అధికారంలోకి వస్తే ఒక్కరూపాయి ఖర్చు లేకుండా వైద్య సేవలు: ఈటల

Etala says Will give free medical services if bjp will win
  • ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీకి ఓటు వేయాలని పిలుపు
  • డబుల్ బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి, ఉద్యోగ కల్పనలో ప్రభుత్వం విఫలమైందని విమర్శ
  • మద్యం అమ్మకాలలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని వ్యాఖ్య
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వైద్యసేవలు అందిస్తామని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ఎన్నికల హామీలను విస్మరించిందన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి, ఉద్యోగ కల్పన వంటి వాటిలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందన్నారు.

మద్యం అమ్మకాలలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానాన్ని దక్కించుకుందన్నారు. వాడవాడలా మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు కళకళలాడుతున్నాయని ఎద్దేవా చేశారు. కూకట్‌పల్లిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వర రావు తలపెట్టిన ఇంటింటికీ బీజేపీ పాదయాత్ర 50వ రోజుకు చేరిన సందర్భంగా ఈటల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Etela Rajender
BJP
BRS
KCR

More Telugu News