BRS: మధ్యాహ్నం 2.30కి బీఆర్​ఎస్​ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించనున్న సీఎం కేసీఆర్​!

  • తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం కేసీఆర్ మీడియా సమావేశం 
  • కేసీఆర్ తో సమావేశమైన హరీశ్ రావు, కవిత
  • కవిత ఇంటికి క్యూ కట్టిన ఆశావహులు
CM KCR to announce the first list of BRS candidates today

తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన అధికార బీఆర్ఎస్ పార్టీ అందుకు తగ్గట్టే ప్రత్యర్థుల కంటే ముందు వరుసలో దూసుకెళ్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా ఈ ఏడాది చివర్లో జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం అందరికంటే ముందే అభ్యర్థుల తొలి జాబితాను వెల్లడించనుంది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు తెలంగాణ సమావేశంలో మీడియాతో మాట్లాడనున్నారు. ఆ సందర్భంగా అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించనున్నారు. టికెట్ ఖాయమైన అభ్యర్థులకు ఈ మేరకు సందేశం వెళ్లినట్టు తెలుస్తోంది. 

మరోవైపు టికెట్ వస్తుందో రాదోనని అనుమానం ఉన్న నేతలు, ఆశావహులు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటికి క్యూ కట్టారు. మరోవైపు కవిత, మంత్రి హరీశ్ రావు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ తో సమావేశం అయ్యారు. మరో మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూడా సీఎంను కలిశారు.

  • Loading...

More Telugu News