Jabardasth Actor Nava Sandeep: ప్రేమ పేరుతో మోసం.. ‘జబర్దస్త్’ నటుడు సందీప్‌పై కేసు

Case Filed against Jabardasth Actor Nava Sandeep
  • 2018లో యువతితో పరిచయం
  • సందీప్ భరోసాతో ఇంటి నుంచి వచ్చి షేక్‌పేటలోని ఓ హాస్టల్‌లో ఉంటున్న యువతి
  • బాధితురాలిని పలుమార్లు వశపరుచుకున్న నటుడు
  • పెళ్లి ఊసెత్తకపోవడంతో ఫిర్యాదు

ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ఫిర్యాదుపై ‘జబర్దస్ట్’ నటుడు, గాయకుడు నవ సందీప్‌పై హైదరాబాద్ మధురానగర్‌లోని పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. నవ సందీప్‌కు 2018లో ఓ యువతితో పరిచయం అయింది. అది మరింత ముదిరింది. విషయం తెలియడంతో యువతి తల్లిదండ్రులు ఆమెను దూరం పెట్టారు. 

సందీప్ భరోసాతో ఇంటి నుంచి వచ్చిన యువతి షేక్‌పేటలోని ఆల్‌హమారా కాలనీలోని ఓ హాస్టల్‌లో ఉంటోంది. ఈ క్రమంలో ఆమెను పలుమార్లు వశపరుచుకున్నసందీప్ పెళ్లి విషయాన్ని మాత్రం దాటవేస్తూ వస్తున్నాడు. దీంతో మనస్తాపం చెందిన యువతి తొలుత గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అది తమ పరిధి కాకపోవడంతో అక్కడి పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి మధురానగర్‌ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. మధురానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News