Bus Accident: బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

AP Govt announces ex gratia for Paderu Ghat Road bus accident victims
  • అల్లూరి జిల్లాలో రోడ్డు ప్రమాదం
  • పాడేరు ఘాట్ వద్ద లోయలో పడిన ఆర్టీసీ బస్సు
  • ఇద్దరి మృతి... 10 మందికి తీవ్ర గాయాలు
  • తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షల పరిహారం
  • గాయపడిన వారికి రూ.1 లక్ష
అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు వద్ద ఇవాళ ఓ ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, గాయాలపాలైన వారికి రూ.1 లక్ష చొప్పున పరిహారం ప్రకటించింది. 

కాగా, పాడేరు ఘాట్ వద్ద బస్సు ప్రమాదం జరిగిన స్థలానికి ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తరలి వెళ్లారు. ఘటన స్థలిని పరిశీలించిన అనంతరం పాడేరు జిల్లా ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
Bus Accident
Paderu
Ex Gratia
Alluri District

More Telugu News