Jagan: పాడేరు ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్బ్రాంతి

CM Jagan shocked after knowing Paderu bus accident
  • అల్లూరి జిల్లాలో లోయలో పడిన బస్సు 
  • ఇద్దరి మృతి... 10 మందికి తీవ్ర గాయాలు
  • క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్న సీఎం జగన్
  • బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ఆదేశాలు
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు వద్ద ఓ ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందడం తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని స్పష్టం చేశారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. 

కాగా, పాడేరు ఘాట్ రోడ్డులో వ్యూ పాయింట్ వద్ద రోడ్డుపై పడి ఉన్న చెట్టును తప్పించబోయి బస్సు లోయలో పడిందని ఘటనకు ప్రత్యక్ష సాక్షులుగా నిలిచిన ఇతర వాహనదారులు వెల్లడించారు. సహాయ చర్యల కోసం ఘటన స్థలికి చేరుకున్న అధికారులు సెల్ ఫోన్ సిగ్నల్స్ లేక తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
Jagan
Bus Accident
Paderu Ghat Road
Alluri District

More Telugu News