Chandrababu: యార్లగడ్డ వెంకట్రావుకు చంద్రబాబు అపాయింట్ మెంట్!

Chandrababu appointment for Yarlagadda confirmed
  • టీడీపీలో పెరుగుతున్న చేరికలు
  • ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన యార్లగడ్డ వెంకట్రావు
  • ఈ నెల 22న టీడీపీలో చేరే అవకాశం
  • రేపు ఉదయం 11 గంటలకు హైదరాబాదులో చంద్రబాబుతో భేటీ!

టీడీపీలో చేరికలు  క్రమంగా ఊపందుకుంటున్నాయి. ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పిన గన్నవరం నేత యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరడం లాంఛనమే అనిపిస్తోంది. రేపు (ఆగస్టు 20) చంద్రబాబుతో యార్లగడ్డ వెంకట్రావు భేటీ కానున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు హైదరాబాదులో చంద్రబాబును కలిసేందుకు యార్లగడ్డకు అపాయింట్ మెంట్ ఖరారైంది. ఈ సమావేశం కోసం యార్లగడ్డ హైదరాబాద్ పయనమైనట్టు తెలుస్తోంది. ఈ నెల 22న గన్నవరంలో జరిగే సభలో యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

  • Loading...

More Telugu News