Gudivada Amarnath: ఈ కారణం వల్లే పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయి: గుడివాడ అమర్ నాథ్

Industries are not going to other states says Gudivada Amarnath
  • రాష్ట్రం నుంచి ఒక్క పరిశ్రమ కూడా వెళ్లడం లేదన్న అమర్ నాథ్
  • వ్యాపార విస్తరణలో భాగంగానే పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయని వ్యాఖ్య
  • ప్రతి 40 కిలోమీటర్లకు ఫిషింగ్ హార్బర్ కానీ, పోర్టు కానీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని వెల్లడి

ఏపీ నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయంటూ విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఏపీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్ నాథ్ విమర్శించారు. రాష్ట్రం నుంచి ఒక్క పరిశ్రమ కూడా వెళ్లడం లేదని, వ్యాపార విస్తరణలో భాగంగానే ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయని చెప్పారు. రాష్ట్రానికి ఉన్న 974 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ప్రతి 40 కిలోమీటర్లకు ఫిషింగ్ హార్బర్ కానీ, పోర్టు కానీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. గతంలో రాష్ట్రంలో 4 పోర్టులు ఉండేవని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 హార్బర్ల నిర్మాణాన్ని చేస్తున్నట్టు తెలిపారు. రూ. 3,500 కోట్లతో ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నట్టు వెల్లడించారు.

  • Loading...

More Telugu News