Allu Arjun: నల్గొండలో కంచర్ల కన్వెన్షన్ సెంటర్ కు ప్రారంభోత్సవం చేసిన అల్లు అర్జున్

Allu Arjun inaugurates Kancharla Convention Center in Nalgonda
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇవాళ నల్గొండ పట్టణానికి విచ్చేశారు. ఇక్కడ నూతనంగా నిర్మించిన కంచర్ల కన్వెన్షన్ సెంటర్ కు ప్రారంభోత్సవం చేశారు. రిబ్బన్ కట్ చేసి కన్వెన్షన్ సెంటర్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, అల్లు అర్జున్ నల్గొండ వచ్చిన సందర్భంగా అభిమానులు పోటెత్తారు. గజమాలతో ఘనస్వాగతం పలికారు. బన్నీ తన అభిమానులను నిరాశపరచకుండా, అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. బన్నీ రాక నేపథ్యంలో, అభిమానులు ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలతో నల్గొండ కళకళలాడింది.
Go Back to Shorts
Allu Arjun
Kancharla Convention Center
Nalgonda
Inauguration
Icon Star
Tollywood

More Telugu News