Blue light glasses: కళ్లకు ‘బ్లూలైట్ గ్లాస్’ పెట్టుకుంటున్నారా..?

  • కంప్యూటర్లు, ఫోన్ల స్క్రీన్ నుంచి బ్లూ లైట్ విడుదల
  • ఈ కారణంగా కంటిపై అనవసర ఒత్తిడి
  • పాటించేందుకు ఇతర మార్గాలూ ఉన్నాయ్
Blue light glasses donot protect eyes from harsh screen light Study

కంటికి అద్దాలను వైద్యులు సిఫార్సు చేసిన తర్వాత, కొనుగోలు సమయంలో బ్లూ లైట్ గ్లాస్ తీసుకోవాలనే సలహా తరచూ వినిపిస్తుంటుంది. కంప్యూటర్, టాబ్లెట్, ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ స్క్రీన్ల ముందు కూర్చుని పనిచేసే వారికి ఈ బ్లూలైట్ గ్లాస్ వినియోగించడం వల్ల కంటిపై కిరణాల చెడు ప్రభావం పడదని ఆప్టికల్ స్టోర్ నిర్వాహకులు చెబుతుంటారు. ఇందులో నిజం పాళ్లు ఎంతన్నది చాలా మందికి తెలియదు. కానీ, ఓ తాజా అధ్యయనం మాత్రం బ్లూలైట్ గ్లాసెస్ వల్ల అంత ఉపయోగం ఉండదని గుర్తించింది..

బ్లూలైట్ ప్రభావానికి ఎక్కువగా గురైనప్పుడు రెటీనా సమస్యలు వస్తాయన్న ఆందోళన నెలకొంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో బ్లూ లైట్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బ్లూలైట్ గ్లాసెస్ అనేవి స్క్రీన్ నుంచి విడుదలయ్యే హానికారక కిరణాల నుంచి కళ్లకు రక్షణ కల్పిస్తుందన్న ప్రచారం ఉంది. బ్లూ కిరణాలను ఈ గ్లాసెస్ అడ్డుకుంటాయి.

17 అధ్యయనాల ఫలితాలను తాజా పరిశోధనలో భాగంగా విశ్లేషించారు. స్టాండర్డ్ గ్లాసెస్ తో పోలిస్తే బ్లూ గ్లాసెస్ అనేవి కళ్లపై భారాన్ని తగ్గించలేవని పరిశోధకులు అంటున్నారు. కంప్యూటర్లు, ఫోన్లు విడుదల చేసే బ్లూలైట్ నిజంగా చాలా తక్కువ. అందుకే బ్లాక్ చేయడం వల్ల పెద్ద మార్పు ఉండదు. రోజులో నాలుగు అంతకంటే ఎక్కువ గంటల పాటు స్క్రీన్ వద్ద సమయం గడిపేవారు ఇరిటేషన్ కు లోనవుతారని నిపుణులు అంటున్నారు. అందుకే బ్లూ లైట్ గ్లాసెస్ ను ధరించడం వల్ల నిద్రను మెరుగురుపరుస్తుందని చెబుతున్నారు. వీటి ధరలు రూ.500 నుంచి మొదలవుతున్నాయి.

ఇతర ప్రత్యామ్నాయాలు
బ్లూలైట్ గ్లాసెస్ మార్కెట్లో కొంచెం  ఖరీదుగానే ఉన్నాయి. అందుకని వీటికి బదులు ఇతర చర్యల ద్వారా కంటిపై స్క్రీన్లు విడుదల చేసే బ్లూవేవ్ లెంథ్ ప్రభావం పడకుండా చూసుకోవచ్చు. 20-20-20 నిబంధన పాటించాలి. 20 నిమిషాల పాటు పనిచేయాలి. ఇలా ప్రతి 20 నిమిషాలు పనిచేసిన తర్వాత 20 సెకండ్ల పాటు బ్రేక్ తీసుకోవాలి. 20 అడుగుల దూరంలోని వాటిని చూడాలి. కళ్లల్లో తగినంత తేమ ఉంచుకోవాలి. అవసరమైతే కంటి చుక్కల మందు వాడాల్సి వస్తుంది.

More Telugu News