Anand Devarakonda: 'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి 'బేబి' సినిమా!

  • జులై 14న విడుదలైన 'బేబి'
  • థియేటర్ల నుంచి భారీ రెస్పాన్స్ 
  • 100 కోట్ల వసూళ్లకు దగ్గరగా వెళ్లిన సినిమా 
  • ఈ నెల 25వ తేదీ నుంచి 'ఆహా'లో   
Baby movie will release in Aha on 25th

ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రేమకథా చిత్రాలలో యూత్ కి ఎక్కువగా కనెక్ట్ అయిన సినిమా 'బేబి'. జులై 14వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. ఆనంద్ దేవరకొండ .. వైష్ణవి చైతన్య .. విరాజ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, సాయిరాజేశ్ దర్శకత్వం వహించాడు.

ఎస్ కే ఎన్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా, తొలి రోజునే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. స్టార్స్ ఎవరూ లేకపోయినా .. కథా పరంగా విలన్ అనేవాడు లేకపోయినా ఈ సినిమా వసూళ్ల వర్షాన్ని కురిపించింది. చాలా తక్కువ రోజులలో 50 కోట్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. 100 కోట్లకు చేరువగా వెళ్లింది. 

అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'ఆహా'వారు దక్కించుకున్నారు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్స్ ను కూడా వదిలారు. విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి కూడా భారీ రెస్పాన్స్ ను రాబట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More Telugu News