SpiceJet: స్పైస్ జెట్ ఫ్లయిట్ లో వృద్ధుడి దుర్బుద్ధి.. ఎయిర్ హోస్టెస్ అసభ్యకర చిత్రీకరణ

Woman exposes SpiceJet passenger who took indecent photos of air hostess
  • సర్వ్ చేయడానికి వచ్చిన సమయంలో వికృత చేష్టలు
  • అంతరంగిక భాగాలను ఫొటోలుగా తీసిన వైనం
  • అనంతరం వాటిని డిలీట్ చేసి, క్షమాపణలు కోరిన ప్రయాణికుడు
వృద్ధుడు తన దగ్గరకు సర్వ్ చేయడానికి వచ్చిన ఎయిర్ హోస్టెస్ అంతరంగిక భాగాలను ఫొటోలుగా చిత్రీకరించిన ఘటన వెలుగు చూసింది. ఈ నెల 2న ఢిల్లీ నుంచి ముంబై వెళుతున్న స్పైస్ జెట్ ఫ్లయిట్ ఎస్ జీ 157లో ఇది చోటు చేసుకుంది. ఓ వ్లాగర్ ఈ విషయాన్ని బయట పెట్టారు. సీ సీటులో కూర్చున్న వృద్ధుడు ఎయిర్ హోస్టెస్ ను ఫొటోలు తీయడాన్ని గమనించి, విషయం ఆమెకు తెలియజేశారు.

సర్వ్ చేయడానికి వచ్చిన సమయంలో ఎయిర్ హోస్టెస్ ప్యాంట్ కింది నుంచి (బోటమ్ వేర్ మోకాలి పై వరకే ఉంది) చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. విషయం ఎయిర్ హోస్టెస్ కు సహ ప్రయాణికుడు తెలియజేయడంతో.. ఫొటోలు తీసినట్టు తనకు కూడా అనిపించిందని ఆమె సైతం అభిప్రాయపడడంతో వృద్ధుడి ఫోన్ తనిఖీ చేశారు. అందులో ఎయిర్ హోస్టెస్ కు సంబంధించి అసభ్యకర ఫొటోలు, వీడియో కనిపించాయి. 

ఈ ఘటనను స్పైస్ జెట్ ధ్రువీకరించింది. సదరు ప్రయాణికుడు తన ఫోన్ నుంచి వాటిని డిలీట్ చేయడంతోపాటు ఎయిర్ హోస్టెస్ కు క్షమాపణలు చెప్పినట్టు ప్రకటించింది. లిఖిత పూర్వకంగా క్షమాపణ తీసుకున్నట్టు స్పష్టం చేసింది.
SpiceJet
passenger
indecent photos
air hostess

More Telugu News