Varun Tej: నా పెళ్లి హైదరాబాదులో సాధ్యం కాదు: వరుణ్ తేజ్

Tollywood hero Varun Tej talks about his marriage
  • ఇటీవల వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల నిశ్చితార్థం
  • నవంబరు, లేదా డిసెంబరులో పెళ్లి జరగొచ్చన్న వరుణ్ తేజ్
  • హైదరాబాదులో పెళ్లి చేసుకోవడమే తనకు ఇష్టమని వెల్లడి
  • కానీ పెళ్లిని ప్రైవేటు వ్యవహారంగా ఉంచాలని భావిస్తున్నామని వివరణ
  • అందుకే డెస్టినేషన్ వెడ్డింగ్ కు మొగ్గు చూపుతున్నామన్న మెగా హీరో

మెగా హీరో వరుణ్ తేజ్, అందాల భామ లావణ్య త్రిపాఠీల వివాహం త్వరలో జరగనుంది. ఇటీవలే వీళ్లిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ తన పెళ్లిపై స్పందించారు. ఈ ఏడాది నవంబరు, లేదా డిసెంబరులో తమ పెళ్లి ఉండొచ్చని తెలిపారు. 

అయితే, తమ పెళ్లి హైదరాబాదులో జరిగే అవకాశాలు లేవని అన్నారు, ఇది పూర్తిగా తమ ప్రైవేటు వ్యవహారం కావడంతో డెస్టినేషన్ వెడ్డింగ్ వైపు మొగ్గు చూపుతున్నామని వెల్లడించారు. వాస్తవానికి హైదరాబాదులో పెళ్లి చేసుకోవడమే తనకు ఇష్టమని, కానీ పరిస్థితుల కారణంగా హైదరాబాదులో పెళ్లి చేసుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. 

కుదిరితే విదేశాల్లో వివాహం చేసుకునే ఆలోచన కూడా ఉందని వరుణ్ తేజ్ పేర్కొన్నారు. మనదేశంలోని మూడు ప్రాంతాలు, ఫారెన్ లో రెండు ప్రాంతాలు పెళ్లి కోసం పరిశీలిస్తున్నామని తెలిపారు. 

ప్రస్తుతం వరుణ్ తేజ్ 'గాండీవధారి అర్జున' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఓ ఈవెంట్ లో పైవిధంగా స్పందించారు.

  • Loading...

More Telugu News