kondapur: కోఠి - కొండాపూర్ మధ్య మహిళలకు ప్రత్యేక బస్సు

Special Woman bus from Koti to Kondapur
  • 127కే నెంబర్‌తో నడిచే ఈ బస్సు 21న ప్రారంభం
  • ఉదయం గం.8.50కి కోఠి నుండి బయలుదేరుతుంది
  • సాయంత్రం గం.5.45కు కొండాపూర్ నుండి తిరిగి కోఠికి బస్సు
మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. కోఠి - కొండాపూర్ రూట్‌లో మహిళలకు ప్రత్యేక బస్సును ఆర్టీసీ నడపనుంది. 127కే నెంబర్‌తో నడిచే ఈ స్పెషల్ బస్సు 21వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ప్రతిరోజు ఉదయం గం.8.50కు కోఠి నుండి బయలుదేరుతుంది. లక్డీకాపూల్, మాసబ్ ట్యాంకు, ఎమ్మెల్యే కాలనీ, ఉషా కిరణ్, గుట్టల బేగం పేట, శిల్పారామం, కొత్తగూడ క్రాస్ రోడ్డు మీదుగా కొండాపూర్ వెళ్తుంది. మళ్లీ సాయంత్రం గం.5.45కు కొండాపూర్ నుండి అదే మార్గంలో కోఠికి వస్తుంది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.
kondapur
koti
Hyderabad

More Telugu News