Jaspreet Bumrah: ఐర్లాండ్ తో తొలి టీ20... మొదటి ఓవర్లోనే బుమ్రా 'డబుల్' ధమాకా

Bumrah double strike in first over troubles Ireland
  • టీమిండియా, ఐర్లాండ్ మధ్య మూడు టీ20ల సిరీస్
  • నేడు డబ్లిన్ లో తొలి మ్యాచ్... టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
  • తొలి ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి సత్తా చాటిన బుమ్రా

టీమిండియా, ఐర్లాండ్ మధ్య మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో నేడు మొదటి పోరు జరుగుతోంది. డబ్లిన్ లోని ద విలేజ్ మైదానం ఈ మ్యాచ్ కు వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన టీమిండియా వాతావరణంలోని తేమ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని బౌలింగ్ ఎంచుకుంది. 

ఈ సిరీస్ లో టీమిండియా కెప్టెన్ గా వ్యవహరిస్తున్న జస్ప్రీత్ బుమ్రా తొలి ఓవర్లోనే రెండు వికెట్లు తీసి తన వికెట్ల దాహాన్ని ప్రదర్శించాడు. గాయంతో సుదీర్ఘకాలం జట్టుకు దూరమైన బుమ్రా... గాయం నుంచి కోలుకుని సరికొత్తగా కనిపించాడు. తొలి ఓవర్ రెండో బంతికి ఐర్లాండ్ ఓపెనర్ బాల్ బిర్నీని బౌల్డ్ చేసిన బుమ్రా... అదే ఊపులో టకర్ (0)ను డకౌట్ చేశాడు. దాంతో ఆతిథ్య జట్టు 4 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

ప్రస్తుతం ఐర్లాండ్ స్కోరు 4 ఓవర్లలో 2 వికెట్లకు 21 పరుగులు. హ్యారీ టెక్టర్ 8, ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

కాగా, ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ సంచలనం రింకూ సింగ్ అరంగేట్రం చేస్తున్నాడు. ఈ డాషింగ్ లెఫ్ట్ హ్యాండర్ కు టీమిండియా తుది జట్టులో స్థానం కల్పించారు.

  • Loading...

More Telugu News