Bandi Sanjay: ఈ నెల 21న ఏపీకి వస్తున్న బండి సంజయ్... కారణం ఇదే!

Bandi Sanjay coming to Andhra Pradesh
  • ఏపీలో సంజయ్ సేవలను వాడుకోవాలనే భావనలో హైకమాండ్
  • ఓటరు నమోదు ప్రక్రియను పర్యవేక్షించనున్న సంజయ్ 
  • మహారాష్ట్ర, గోవా, ఒడిశాలలో కూడా బాధ్యతల అప్పగింత

తెలంగాణ బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన బండి సంజయ్ ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించిన సంగతి తెలిసిందే. తెలంగాణతో పాటు ఏపీలో కూడా ఆయన సేవలను వాడుకోవాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. మరోవైపు ఈ నెల 21న ఆయన ఏపీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఏపీలో ఓటరు నమోదు కార్యక్రమం ప్రక్రియను ఆయన సమీక్షించనున్నారు. మహారాష్ట్ర, గోవా, ఒడిశాలో కూడా ఓటరు నమోదు ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతలను ఆయనకు అప్పగించారు. మరోవైపు ఏపీకి చెందిన పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరిలలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నారు.

  • Loading...

More Telugu News