Mondithoka Jagan Mohan Rao: ఎంపీ కేశినేని నానిపై వైసీపీ ఎమ్మెల్యే ప్రశంసలు

MLA Mondithoka Jagan Mohan Rao sensational comments On Kesineni
  • ప్రజలకు సేవ చేయడం వల్లే కేశినేని గెలిచారన్న మొండితోక జగన్‌మోహన్
  • ఆయనతో తమకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని వెల్లడి
  • ఓ వ్యక్తిగా కేశినేని నాని మంచి వారని వ్యాఖ్య
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానితో తమకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని చెప్పారు. పార్టీ మారుతారా? లేదా? అనేది కేశినేని నాని ఇష్టమని అన్నారు. ప్రజలకు సేవ చేయడం వల్లే కేశినేని గెలిచారని చెప్పుకొచ్చారు.

‘‘వ్యక్తిగా కేశినేని నాని మంచి వారు. ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచిన చోట.. ఆయన ఎంపీగా గెలిచారు. ప్రజలకు సేవ చేయబట్టే ఆయన విజయం సాధించారు” అని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో ఎవరి వెసులుబాటును బట్టి వాళ్లు మాట్లాడుతారని అన్నారు. ప్రజా సమస్యల విషయంలో ఆయన్ను అడగడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. ప్రజల కోసం తాను ఎవరితోనైనా పని చేస్తానని చెప్పారు.
Mondithoka Jagan Mohan Rao
Kesineni Nani
nandigama
Vijayawada
YSRCP
Telugudesam

More Telugu News