Chiranjeevi: భోళా శంకర్ రెమ్యూనరేషన్‌ను తిరిగిచ్చిన చిరంజీవి?

Chiranjeevi returns remuneration to Bhola Shankar producer
  • బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచిన 'భోళాశంకర్'
  • రూ. 10 కోట్ల చెక్ ను చిరంజీవి తిరిగిచ్చేశారంటూ వార్తలు
  • ఈ నెల 25న హిందీలో విడుదలవుతున్న 'భోళాశంకర్'
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'భోళాశంకర్' నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. తమన్నా, కీర్తి సురేశ్, సుశాంత్, శ్రీముఖి, రష్మి, వెన్నెల కిశోర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదలయింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమాకు చిరంజీవి రూ. 55 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఈ మొత్తాన్ని సినిమా విడుదలకు ముందే చిరంజీవికి నిర్మాత ఇచ్చేశారట. ఇందులో రూ. 10 కోట్లకు చెక్ ఇచ్చారట. అయితే సినిమాకు నష్టాలు రావడంతో... రూ. 10 కోట్ల చెక్ ను చిరంజీవి వెనక్కి ఇచ్చేశారట. మరోవైపు ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేస్తున్నారు. ఆగస్ట్ 25న హిందీ వర్షన్ విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. హిందీలో చిరంజీవికి ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ డబ్బింగ్ చెప్పినట్టు సమాచారం.
Chiranjeevi
Tollywood
Ghola Shankar
Remuneration

More Telugu News