IKEA Hyderabad: ల్యాంప్ కొందామని వెళ్లి.. తెగ షాపింగ్ చేసిన యువతి.. అర చేతిలో ఆరు అడుగుల రశీదు!

Womans visit to IKEA Hyderabad to buy a lamp turns into an unexpected shopping spree
  • ఒక్కటే ల్యాంప్ కోసం వెళ్లి.. రెచ్చిపోయి మరీ షాపింగ్
  • భారీ కొనుగోళ్లతో మనిషి పొడవు రశీదు
  • ట్విట్టర్ లో షేర్ చేసిన హైదరాబాద్ మహిళ
హైదరాబాదీ మహిళ ఒకరికి ఊహించని అనుభవం ఎదురైంది. ఒక్క ల్యాంప్ కోసం ఐకియా స్టోర్ కు వెళ్లగా.. చివరికి ఆమె ఆరు అడుగుల పొడవు మేర బిల్లు వచ్చేంతగా షాపింగ్ చేసేసింది. సాధారణంగా భారీ సంఖ్యలో వస్తువులను కొనుగోలు చేసినప్పుడు అంత పొడవైన రశీదు వస్తుంటుంది. నిజానికి  హైదరాబాద్ కు చెందిన సమీర షాపింగ్ లిస్ట్ అంత లేదు. ఒకటే ల్యాంప్ కోసం వెళ్లింది. కానీ, ఐకియా స్టోర్ నమూనా ఫలితంగా ఆమె అసలు కావాల్సింది మర్చిపోయి, రెచ్చిపోయి మరీ షాపింగ్ చేసేశారు.

‘‘ఒక ల్యాంప్ కొందామని ఐకియాకి వెళ్లాను. ల్యాంప్ కొనడం మర్చిపోయాను’’అంటూ సమీర అనే మహిళ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది. ఐకియా స్టోర్ లో పొడవాటి బిల్లు కాపీని చేతితో పట్టుకుని ఫొటో దిగారు. దాన్ని ట్విట్టర్ లో పంచుకున్నారు. ఆగస్ట్ 10న సమీర ఈ పోస్ట్ పెట్టగా, ఇప్పటి వరకు 2.38 లక్షల మంది దీన్ని చూశారు. ఐకియా స్టోర్ లోపల బిల్లు పట్టుకుని మరీ ఆమె ఫొటో తీసుకున్నారు. ‘‘ఎంతో నిజం నేను మరోసారి ఐకియాకి వెళ్లాలంటే భయపడుతున్నాను’’ అని ఓ యూజర్ కామెంట్ చేశారు. ‘‘ఐకియా వద్ద కొనుగోలు చేసిన అసాధారణ ల్యాంప్ నా వద్ద ఉంది. 50 శాతం డిస్కౌంట్ తో దాన్ని మీరు తీసుకోండి’’అని ఒక యూజర్ స్పందించారు.
IKEA Hyderabad
a lamp
Womans
visit
shopping spree

More Telugu News