Airindia: రూ.1,470కే విమాన టికెట్.. ఎయిరిండియా బంపరాఫర్

 Air India launches 96 hour sale starting today till Sunday
  • 96 గంటల ప్రత్యేక ఆఫర్ ప్రకటన
  • ఎలాంటి సౌకర్య రుసుము లేకుండా టికెట్ల బుకింగ్
  • ఆదివారం అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉండనున్న ఆఫర్

దేశీయ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. 96 గంటల ఈ ఆఫర్ లో భాగంగా ఎలాంటి ఇతర సౌకర్య రుసుము లేకుండా ప్రారంభ టికెట్టు ధరను సంస్థ రూ.1,470గా నిర్ణయించింది. రూ.10,130కే బిజినెస్‌ క్లాస్‌ టికెట్ కొనుగోలు చేయవచ్చని తెలిపింది. దేశీయ, ఎంపిక చేసిన అంతర్జాతీయ రూట్లకు కూడా ఈ ఆఫర్ వర్తింస్తుందని వెల్లడించింది.  నిన్న మొదలైన ఆఫర్ ఆదివారం అర్ధరాత్రి 11.59 నిమిషాలకు ముగుస్తుంది. 

ఈ లోపు బుకింగ్‌ చేసుకున్న ప్రయాణికులు సెప్టెంబర్‌ 1 నుంచి అక్టోబర్‌ 31 లోపు ప్రయాణించాల్సి ఉంటుందని ఎయిర్ ఎండియా తెలిపింది. ఎయిర్‌ ఇండియా వెబ్‌సైట్‌ (airindia.com), మొబైల్‌ యాప్‌ ద్వారా టికెట్లు బుకింగ్‌ చేసుకోవచ్చునని కంపెనీ వర్గాలు సూచించాయి. వచ్చే పండగ సీజన్‌లో తక్కువకే విమాన ప్రయాణం చేయాలనుకునేవారిని దృష్టిలో పెట్టుకొని ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రిటర్న్ టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు డబుల్‌ లాయల్టి బోనస్‌ పాయింట్లు కూడా పొందవచ్చునని తెలిపింది.

  • Loading...

More Telugu News