KA Paul: జనసేన పార్టీని పవన్ బీజేపీలో కలిపేస్తారు.. కేఏపాల్ సంచలన వ్యాఖ్యలు

KA Paul Sensational Comments On Pawan Kalyan
  • రూ. 5 వేల కోట్లు, మంత్రి పదవి తీసుకుని పవన్ తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని ఆరోపణ
  • ప్యాకేజీ స్టార్లు కావాలా? రియల్ హీరోలు కావాలా? అని ప్రశ్న
  • మాల, మాదిగలను విడదీశారంటూ చంద్రబాబుపై ఫైర్

‘’చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినట్టుగానే.. పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేసేస్తారు’’ అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ. 5 వేల కోట్లు, మంత్రి పదవి తీసుకుని పవన్ తన పార్టీని బీజేపీలో కలిపేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు.

సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ప్యాకేజీ స్టార్లు కావాలా? రియల్ హీరోలు కావాలా? సినీ హీరోలు కావాలా? వరల్డ్ హీరోలు కావాలా? అని ప్రజలను ప్రశ్నించారు. మాలమాదిగలను విడదీశారంటూ చంద్రబాబుపైనా పాల్ విరుచుకుపడ్డారు.

  • Loading...

More Telugu News