USA: భారతీయ విద్యార్థులకు షాక్.. ఎయిర్‌‌పోర్టు నుంచే వెనక్కు పంపించేసిన అమెరికా

US deports 21 Indian students deported back to India due irregularities in their official documents
  • అట్లాంటా, శాన్‌ఫ్రాన్‌సిస్కో, షికాగో ఎయిర్‌పోర్టుల్లో గురువారం వెలుగు చూసిన ఘటన
  • సాధారణ తనిఖీల్లో కొందరిపై అనుమానం రావడంతో అధికారుల లోతైన పరిశీలన
  • అధికారుల పరిశీలనలో విద్యార్థుల పత్రాలు సక్రమంగా లేవని వెల్లడి
  • దీంతో, ఎయిర్ పోర్టు నుంచే వారిని రిటర్న్ ఫ్లైట్‌లో ఇండియాకు పంపించేసిన వైనం

పైచదువుల కోసం అమెరికాకు వెళ్లిన కొందరు భారతీయ విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం ఊహించని షాకిచ్చింది. మొత్తం 21 మందిని ఎయిర్‌పోర్టు నుంచే రిటర్న్ ఫ్లైట్లలో  వెనక్కు పంపించేసింది. వీరిలో అధికశాతం తెలుగు రాష్ట్రాల వారేనని తెలిసింది. 

గురువారం అట్లాంటా, శాన్ ఫ్రాన్సిస్కో, షికాగో ఎయిర్‌పోర్టులకు చేరుకున్న కొంత సేపటికీ విద్యార్థులను తనిఖీ చేశారు. ఈ క్రమంలో కొందరిపై అనుమానం రావడంతో వారి పత్రాలను లోతుగా పరిశీలించారు. విద్యార్థుల ఆర్థిక పరిస్థితులు, ఫోన్లు, మెయిళ్లు, కన్సల్టెన్సీలు, వారు ప్రవేశాలు పొందిన వర్సిటీల్లో ఫీజులకు సంబంధించిన వివరాలన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చివరకు కొందరి వద్ద ఉన్న పత్రాల్లోని వివరాలు సక్రమంగా లేకపోవడంతో వారిని వెనక్కు పంపించేశారు. ఇలా తిరస్కరణకు గురైన వారు మళ్లీ అమెరికా వీసాకు దరఖాస్తు చేసుకునేందుకు అయిదేళ్ల దాకా అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News