KTR: వెంకటరావు భవిష్యత్తుకు భరోసా మాది: కేటీఆర్

Thellam Venkatarao rejoined BRS in presence of KTR
  • మళ్లీ బీఆర్ఎస్ లో చేరిన తెల్లం వెంకటరావు
  • రానున్న రోజుల్లో భద్రాచలంను అభివృద్ధి చేస్తామన్న కేటీఆర్
  • మళ్లీ గెలిచేది బీఆర్ఎస్ అని ధీమా
కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి షాక్ తగిలింది. ఆయన ముఖ్య అనుచరుడు తెల్లం వెంకటరావు మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సమక్షంలో మళ్లీ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, అతి తక్కువ సమయంలోనే తాను చేసిన తప్పును వెంకటరావ్ గ్రహించారని చెప్పారు. కాంగ్రెస్ ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారిని ఈదినట్టేననే విషయం ఆయనకు అర్థమయిందని అన్నారు. వెంకటరావు భవిష్యత్తుకు భరోసా తమదని చెప్పారు. 

ప్రాజెక్టుల పునరుద్ధరణతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందని, కోటి ఎకరాల్లో సాగు జరుగుతోందని కేటీఆర్ చెప్పారు. అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందిందని అన్నారు. నీటి కష్టాలు, విద్యుత్ కష్టాలు లేవని చెప్పారు. ఎవరు ఎంత మొరిగినా మళ్లీ గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే అని అన్నారు. రానున్న రోజుల్లో భద్రాచలం ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని, గోదావరి కరకట్ట మరమ్మతు పనులు కూడా చేపడతామని తెలిపారు.
KTR
BRS
Thellam Venkara Rao
Bhadrachalam

More Telugu News