Telangana: సీఎం కేసీఆర్​ మెదక్ జిల్లా పర్యటన వాయిదా.. కారణం ఇదే

Cm KCR Visit To Medak rescheduled to 23rd august
  • ఈ నెల 19న మెదక్‌లో పర్యటించాల్సిన సీఎం
  • భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో పర్యటన వాయిదా
  • ఈ నెల 23న మెదక్‌లో పర్యటిస్తారని సీఎంఓ ప్రకటన

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెదక్‌ జిల్లా పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఆయన 19న మెదక్‌ జిల్లాలో పర్యటించాల్సి ఉంది. కానీ, ఈ పర్యటనను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో పర్యటనలో మార్పు చేసినట్టు తెలిపింది. వచ్చే బుధవారం మెదక్ జిల్లాకు వెళ్లనున్న సీఎం  మెదక్‌ సమీకృత కలెక్టరేట్‌, పోలీసు సూపరింటెండెంట్‌ కార్యాలయం, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.

  • Loading...

More Telugu News