Gutha Sukender Reddy: కోమటిరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోవడానికి ఇదే సరైన సమయం: గుత్తా సుఖేందర్ రెడ్డి

Gutha Sukender Reddy fires on Komatireddy
  • ఏ పదవీ వద్దంటున్న కోమటిరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోవాలన్న గుత్తా
  • తనపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపాటు
  • మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావడమే తమకు కావాలని వ్యాఖ్య

తనకు ఏ పదవీ వద్దని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారని.. అలాంటప్పుడు రాజకీయ సన్యాసం తీసుకోవాలని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోవడానికి ఇదే సరైన సమయమని చెప్పారు. సమయం, సందర్భం లేకుండా తనపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని... ఇది సరి కాదని అన్నారు. 

కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడు ఒకటంటే.. మరొక నేత ఇంకొకటి అంటారని... ఇలాంటి పార్టీ అధికారంలోకి ఎలా వస్తుందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా తాను పట్టించుకోబోనని... ఎవరికి టికెట్ ఇచ్చినా తన సహకారం పూర్తిగా ఉంటుందని చెప్పారు. తమకు కావాల్సింది మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావడమేనని అన్నారు.

  • Loading...

More Telugu News