Gudivada Amarnath: పవన్ కల్యాణ్! మోదీకి చెబుతాం.. డాడీకి చెబుతామంటూ ఈ పిల్ల చేష్టలేంటి?: గుడివాడ అమర్నాథ్

Gudiwada Amarnath satire on Pawan Kalyan
  • ఎర్రమట్టి దిబ్బలకు సంబంధించి ఆరోపణలపై ఘాటుగా స్పందించిన మంత్రి
  • ఎర్రమట్టి దిబ్బల్లో ఏదో జరిగిపోతోందని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమన్న మంత్రి
  • ప్రతిపక్ష నేతగా నిర్మాణాత్మక సూచనలు చేయాలని హితవు

భీమిలి ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించి విమర్శలు గుప్పించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా స్పందించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ... ఎర్రమట్టి దిబ్బల్లో ఏదో జరిగిపోతోందని జనసేనాని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తాను చెప్పినట్లుగా చేయకపోతే ప్రధాని మోదీకి చెబుతాం... డాడీకి చెబుతాం అంటూ పిల్ల చేష్టలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతగా పవన్ కల్యాణ్ నిర్మాణాత్మక సూచనలు చేస్తే మంచిదని హితవు పలికారు. కాగా, మంత్రి అమర్నాథ్ అంతకుముందు ఏపీ ప్రీమియర్ లీగ్‌ను ప్రారంభించారు.

  • Loading...

More Telugu News